పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలం నాటికి సంపూర్ణమైన సామాజిక విప్లవకారుడే. సమాజాన్ని నడిపిస్తున్న గతి సూత్రాలను గుర్తించి, వాటి వలన ఏర్పడుతున్న వైరుధ్యాలను తెలుసుకొని వాటికి పరిష్కారాలను పేర్కొని వైరుధ్యాలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నవాళ్ళు సామాజిక విప్లవకారులు. విప్లవం అంటే మార్పు. పాత వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థ. పాతదాని కన్నా మెరుగైన వ్యవస్థ రావడం విప్లవం. విప్లవాలు ఆకాశంలోంచి ఊడిపడవు. ఉద్యమాల ద్వారా సిద్ధిస్తాయి. ఆ ఉద్యమాలు ప్రజా ఉద్యమాలైతే విప్లవం త్వరగా వస్తుంది. వ్యక్తిగతమైనది అయితే స్వల్ప మార్పు రావచ్చు. లేదా విప్లవానికి సంబంధించిన భావ ప్రచారం జరుగుతుంది. పోతులూరి వీరబ్రహ్మంగారు సామాజిక విప్లవం రావడానికి అవసరమైన భావప్రచారం చేయడమే కాక విప్లవ వ్యతిరేక శక్తులతో చర్చలు, వాదాలు కూడా చేశారు. తన భావ ప్రచారానికి అవసరమైన వ్యవస్థను కూడా నిర్మించారు. ప్రతీపశక్తులతో ప్రత్యక్షంగా ఎదుర్కొన్న తొలి తెలుగు కవి వీరబ్రమ్మయే కావచ్చు. అందుకే ఆయన ప్రాచీన తెలుగు కవులలో సామాజిక విప్లవ కవి.  పాల్కురికి సోమన, తాళ్లపాక అన్నమయ్య, వేమనవంటి వాళ్ళు కొంత తరతమ భేదాలతో ఈ కోవకు చెందిన వాళ్లు....

బ్రహ్మంగారు తాత్వికుడు కావడానికి తాను పుట్టి పెరిగిన శతాబ్దిలోని ఆయా పరిస్థితులే హేతుభూతాలయ్యాయని చెప్పవచ్చు. - కన్నెగంటి రాజమల్లాచారి

బ్రహ్మంగారు చేసిన గురుబోధలు ఎంతో గుట్టుగా ఉన్నా పామర జనం గుండెలలోకి సూటిగా దూసుకుపోయే బాణాల వంటివి. - ఆరుద్ర

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good