భారతదేశంలో పీడిత ప్రజానీకం విముక్తి చెందాలంటే, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా, సామాజిక వివక్షతకు సైతం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంది. వర్గ పోరాటాల్ని, సామాజిక విముక్తి కోసం జరిగే పోరాటాలను జమిలిగా సాగించినప్పుడు మాత్రమే అణగారిన వర్గాలకు నిజమైన విముక్తి లభిస్తుంది. ఈ లక్ష్యానికి దోహదపడే రీతిలో నవతెలంగాణ దినపత్రిక గత రెండేళ్లుగా చార్వాక అనే పేరుతో ఒక శీర్షికను నిర్వహిస్తున్నది. ఆ శీర్షిక క్రింద భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఉద్యమించిన పలువురు మహనీయుల జీవిత చరిత్రలను 'సామాజిక కిరణాలు' పేరుతో రేఖామాత్రంగా అందించింది. ఆ వ్యాసాల సంకలనమే ఇది. సామాజిక న్యాయ సాధన అధిక ప్రాధాన్యత సంతరించుకున్న నేటి తరుణంలో ప్రతి ఒకరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good