విలువల వలువలు కనబడక పోవడం అన్నది ఇప్పుడు మాత్రమే జరుగుతున్న విషయం కాదు. అది భారత కాలం నుండి ఉంది. అంతకు ముందు నుండి కూడా ఉంది. పాంచాలి వలువల్ని విప్పే ప్రయత్నం దుశ్శాసనుడు చేయనే చేశాడు. అదుకు శికక్షూడా అనుభవించాడు. అదువల్ల ఈ పోరాటం లోగడ జరిగింది. ఇప్పుడు జరుగుతోంది. ఇకముందు జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధానికి అంతం లేదు. కష్టసాధ్యమైనా చెడుపై మంచికి గెలుపు ఖాయం! - అనే భావంతోనే ఆశాజీవి అయిన మనిషి బతుకుతున్నాడు.

అయితే ఈ యుద్ధం నిరంతరం కొనసాగించడానికి ఇప్పుడు నిజంగానే మనిషిని బతికించుకోవాల్సిన అత్యవసర సమయం ఆసన్నమైంది. ఒక వైపు పొంచి ఉన్న అణుయుద్ధం, మరోవైపు కాలుష్యం, ఇంకోవైపు మానవ నీచ ప్రవృత్తి. ఇవి మూడూ మూడు వైపుల నుండి దండెత్తి, మనిషిని ఒక మూలకు నొక్కి పెడుతున్నాయి. మనసును ముక్కలు చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే జురాసిక్‌ యుగంలో రాజ్యమేలి, నశింపు పొందిన డైనోసార్స్‌లాగా ఈ శతాబ్దపు అంతానికి మనిషి నశించి పోయే ప్రమాదం లేక పోలేదు.

అందువల్ల మానవులందరూ అన్నిరకాలుగా మనిషిని బ్రతికించుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అది తిరుగుబాట్ల ద్వారానే కావొచ్చు. తాత్విక చింతన ద్వారానే కావొచ్చు, కళల ద్వారానే కావొచ్చు, సాహిత్యం ద్వారానే కావొచ్చు, మరింకో మార్గం ద్వారానైనా కావొచ్చు. కాని, వైజ్ఞానిక దృక్పథం వాటిలో అంతస్సూత్రంగా భాసించాలి- తప్పదు! ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే లక్ష్యం నెరవేర్చడంలో ఈ పుస్తకం ఉపకరిస్తుంది.

- రచయిత

Write a review

Note: HTML is not translated!
Bad           Good