హిందూమతంలో అనేక కులాలున్నాయి. ఆ కులాల మధ్య ఎన్నో వైరుధ్యాలున్నాయి. బ్రాహ్మణాధిక్య భావజాలం, కులవివక్ష, అనాదిగా అట్టడుగు సామాజిక వర్గాల అణచివేత, మనువాదవికృతి... ఇంకా అనేకానేక సమస్యలపై తీవ్ర విభేదాలున్నాయి, విరోధాలున్నాయి. బ్రాహ్మణ, ఇతర అగ్రకులాలకు చెందిన రామమోహన రాయ్‌, రవీంద్రనాథ్‌ టాగోర్‌, వీరేశలింగం, గురజాడ, చిలకమర్తి, శ్రీపాద, ఉన్నవ, త్రిపురనేని రామస్వామి చౌదరి, నార్ల, గోపీచంద్‌, సురవరం ప్రతాపరెడ్డి వంటి ఎందరో మేధావులు అగ్రవర్ణ దురహంకారాలకు, అనాగరికమైన కులవివక్షకు, అమానుష సామాజిక పీడనకు వ్యతిరేకండా పోరాడారు. తీవ్రమైన లోపాలను, పాపాలను సరిచేసుకుని, సామాజిక వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని గట్టిగా కొట్లాడిన వెనుకబడిన కులాల దళిత వర్గాల మేధావులు కూడా హిందూసమాజ సంస్కరణనే కోరారు తప్ప హిందూ  మత నాశనాన్ని కోరుకోలేదు. కులవ్యవస్థను వేయి పడగల హైందవ నాగరాజుగా అభివర్ణించిన మహాకవి గుర్రం జాషువా కూడా కులనిర్మూలననే తప్ప హిందూమత నిర్మూలనను కలనైనా తలచలేదు. ఈ కాలంలో దళిత బహుజన వర్గాల అభ్యున్నతి, మనువాద అథోగతి కోసం పరిశ్రమిస్తూ బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించి తీరుతామంటున్న ఉద్యమకారులు సైతం మొత్తంగా హిందూ సమాజ విచ్చితిని కాంక్షించడంలేదు.

కాని ఐలయ్య దారివేరు. తీరువేరు. అతడికి కావలసింఇ హిందూమతం అంతరించడం! బడుగు బలహీన బహుజన వర్గాలు మూకుమ్మడిగా అన్న మతాలలో చేరిపోవటం, హిందూమతం ఎంత త్వరగా మరణిస్తే ఐలయ్య అంత సంతోషిస్తాడు....

పేజీలు : 87

Write a review

Note: HTML is not translated!
Bad           Good