అమెరికా దేశస్ధుడైన పౌల్‌.సి.హారీస్‌ (1868-1947) విశ్వవిఖ్యాతి గాంచిన 'రోటరీ' స్వచ్ఛంద సేవా సంస్ధ సంస్ధాపకులలో ముఖ్యుడు. వివిధ వృత్తులకు సంబంధించిన మన:ప్రవృత్తులను అధ్యయనం చేయ్యడానికి తన న్యాయవాద వృత్తిని త్యజించి ఒక సాధారణ కార్మికుడిగా జీవించి మానవతా వాదిగా వినుతికెక్కిన మహానుభావుడు.
IIII
బాబా ఆమ్టే (1914) మహారాష్ట్రకు చెందిన న్యాయవాది. కుష్టురోగం అంటు వ్యాధి కాదని, సకాలంలో చికిత్సకు నయమౌతుందని నిరూపించిన వ్యక్తి. నాగపూర్‌ సమీపంలో ఆనందవనం అనే ఆశ్రమం నిర్మించి కుష్ఠు రోగులకు జీవనోపాధి, జీవిత పరమావధి అందించిన మానవతావాది.
III
అరవిందుడు (1872-1950) కలకత్తాలో జన్మించాడు. నగరంలో చాలా పలుకుబడి కలిగిన డాక్టర్‌ గారి కుమారుడాయన. చదువు పూర్తి అయిన తరువాత స్వాతంత్య్రోధ్యమంలో చేరి జైలు పాలయ్యాడు. చివరి దశలో పాండిచేరిలో యోగసాధనకి, ధర్మ ప్రబోధనకు అలవాలమైన ఆశ్రమాన్ని స్ధాపించాడు.
III
ఈ విధంగా ఈ పుస్తకంలో శ్రీ బి.వి.పట్టాభిరామ్‌ గారు పిల్లల కోసం-పై మహనీయులతోపాటు జోసెఫ్‌ డామియన్‌, మెల్ఫిన్‌ జోన్స్‌, రామన్‌ మెగసెసే, జీన్‌ హెన్రీ డ్యూయంట్‌, అబ్రహాం లింకన్‌, రాబర్ట్‌ స్టీవెన్‌సన్‌, స్మిత్‌ బాడెన్‌ పవెల్‌, అనప్పిండి సీతమ్మ, రాజారామమోహనరాయ్‌, జంషెడ్జీటాటా, హెలెన్‌ కెల్లర్‌, అనీబిసెంట్‌, మీర్‌ యూసఫ్‌ అలీఖాన్‌, ఫ్లారెన్స్‌ నైటింగేల్‌, కందుకూరి వీరేశలింగం, ఎలిజిబెత్‌ ఫ్రై, దుర్గాబాయి దేశముఖ్‌, లూయీస్‌ బ్రెయిలీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు, శామ్యూల్‌ జాన్సన్‌, ద్వారకనాధ్‌, శాంతారామ్‌ కోట్నీస్‌ల జీవిత చరిత్రలను సంక్షిప్తంగా పరిచయం చేశారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good