'భారత ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చుంటుందా''? అడిగాడు వాత్సవ.
'కూర్చోక ఏం చేస్తుంది?' ఎదురు ప్రశ్న వేశాడు దివాన్‌ సాబ్‌.
'సైన్యాలను పంపి నీ పీచం అణుస్తుంది' అన్నాడు వాత్సవ. బిగ్గరగా నవ్వి తల ఎగురవేశాడు దివాన్‌ సాబ్‌.
'దుర్గేశముఖి దయ మాకు పూర్తిగా ఉన్నది. వాడేకర్‌ని మేము తీసుకువచ్చినది అందుకే. మా మీదకు వచ్చే సైనికుల పీచం అణచితీరతాము' అంటూ తన అనుచరులకు సైగ చేశాడు.
నోరు తెరిస్తే మాట బయటకి వస్తుందో లేదో తెలియటం లేదు వాత్సవకు.
సాధారణమైన యుద్ధ ట్యాంకుల ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వీలు కల్పించే పరిశోధనలు చేస్తున్నాడు వాడేకర్‌.
అతని పరిశోధన వివరాలు శత్రువు చేతికి చిక్కితే దేశం గొప్ప ప్రమాదంలో చిక్కుపడుతుందని భావించారు స్పెషల్‌ బ్రాంచి అధికారులు.
దేశంలోనే వున్న ఒక దేశద్రోహి చేతికి చిక్కుతాయని వారు ఊహించలేదు. వాత్సవ ఆలోచనలు పూర్తికాకముందే అతని చేతులు వెనక్కివిరిచి పట్టుకున్నారు దివాన్‌సాబ్‌ అనుచరులు.
'ఈ రాత్రికి ప్రత్యేక పూజ చేయాలని అనుకుంటున్నాను. అమ్మవారికి నరబలి ఇచ్చి తృప్తిపరుస్తాను. ఇతన్ని పూజామందిరం దగ్గర బంధించండి' అని ఆజ్ఞ ఇచ్చాడు దివాన్‌సాబ్‌.
వెంటనే వాత్సవను మరో మందిరంలోకి తీసుకుపోయారు దివాన్‌సాబ్‌ అనుచరులు. చేతుల్ని పైకెత్తి మదిరాపానపు మత్తులో చిందులు తొక్కుతున్న దుర్గేశముఖి నిలువెత్తు విగ్రహం వున్నది ఆ మందిరంలో.
దేశభద్రతకు ముప్పుగామారిన దివాన్‌సాబ్‌ నుండి ప్రభుత్వ రహస్యపత్రాలను వాత్సవ ఎలా చేజిక్కుంచుకున్నాడో తెలుసుకోవాలంటే అడుగడుగునా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో రూపొందిన మధుబాబు నవల 'సాలభంజిక' చదవటం తప్ప మరో మార్గం లేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good