కొందరు - కథలు వ్రాసి, గొప్పకథకులనిపించుకున్న వారున్నారు. కొందరు నవలలు వ్రాసి గుర్తింపు, గౌరవం పొందినవారున్నారు. అలాగే కవులనిపించుకుని రాణికెక్కినవారున్నారు. కాని 'వ్యాసం' అనే ప్రక్రియకు అపూర్వమైన సాహిత్యగౌరవం తెచ్చిపెట్టి - పాఠకులను ఆకట్టుకున్న మహా రచయిత పానుగంటి లక్ష్మీనరసింహారావుగారొక్కరే.

దేశభక్తి, సంఘసంస్కరణ, స్వదేశ పరిశ్రమలు, స్త్రీస్వాతంత్య్రం, నాటకం, సాహిత్యం, మతం, ఆధ్యాత్మికత, భాష, ఎన్నికలు, వైద్యం, నాగరికత మొదలైన వందలాది అంశాల మీద సునిశిత విమర్శనాస్త్రాలను సంధించిన 'సాక్షి' వ్యాస రచనలకు ఈ నాటికే కాలదోషం పట్టకపోవటంలో ఆశ్చర్యం లేదుగాని, రచయిత ఊహాబలం, రచనా పటిమ దాదాపు శతాబ్ధకాలం వరకు సజీవంగా ఉన్నందుకు గర్వించాలి. విశ్వసాహిత్యంలో సజీవనదులవలె అన్ని కాలాల్లోనూ ప్రవహించుతూ, అన్ని తరాల పాఠకులను అలరించే సజీవ రచనలు కొన్ని అయినా ఉండటం సహజం.జ ఈ పోలికగల సాహిత్యసంపదలో 'సాక్షి' వ్యాసాలు స్ధానం సంపాదించుకున్నాయనటంలో సందేహం లేదు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good