Rs.80.00
Out Of Stock
-
+
''ఈ 'అభ్యుదయ సాహిత్యం' ఆకస్మికంగా పుట్టలేదు. ఈ సాహిత్య విశేషం ఆవిర్భవించటానికి ముందున్న సాంఘిక రాజకీయ పరిస్ధితులే దీని పుట్టుకకు మూలం. ఇరవయ్యోశతాబ్ది తెలుగు సాహిత్యానికి మూలకందమైన ఆధునిక సాహిత్య సిద్ధాంత ధోరణులే - ఈ అభ్యుదయ సాహిత్యావిర్భావానికి కారణాలు. ఈ పరిణామక్రమాన్ని ఈ శతాబ్ధం తొలి రోజుల్లోనే సాహితీస్ధితినిబట్టి వివరించడం సాధ్యమవుతుంది''.
''ఈ రోజుల్లో సామాజిక చైతన్యం - సామాజికి స్పృహ - వర్గ చైతన్యం - వర్గపోరాటం - మార్క్సిస్టు అవగాహన అనే పడికట్టురాళ్ళు వాడని రచయితలు మనకు కనిపించరు. ఈ పదాలకు సరైన, శాస్త్రీయమైన అర్ధాన్నీ - అన్వయాన్నీ ఇచ్చిన ఖ్యాతి మార్క్స్ - ఎంగెల్స్ - లెనిన్లది. అయితే జీవితంలో ఈ పై సిద్ధాంతం నమ్మనివారూ, ఆచరణకు ఇది పనికిరాదనేవారూ, కాలం చెల్లిందనే వారూ - కూడా పైన చెప్పిన పదాలను తమ విమర్శల్లో - అన్వయాల్లో వాడడం చూస్తుంటే మార్క్స్ - ఎంగెల్స్ - లెనిన్లు చచ్చి బతికిపోయారనిపిస్తుంది''.