ఇది ఒక భార్య వేదన. పిల్లల కోడి కావటం వలన విశ్రాంతి లేకపోవటం, ఇల్లు దిద్దుకోవటంలో కాస్త కూడా తీరిక దొరకక పోవటం ఆమె స్ధిగి. పద్యాలు వ్రాయటం ఆమె ఆసక్తి. అందుకు ఆమె ఉల్లాసాన్ని, ఓపికను కూడా ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాల్సిందే. ''ఓపిక దెచ్చుక కొన్ని పద్యముల్‌ జల్లగ వ్రాయజురు సుమీ'' అని చెప్పడంలో వ్యక్తమైంది ఆ ఒక్క స్త్రీ స్ధితి మాత్రమే కాదు, కవిత్వ రంగంలో, ఆ మాటకొస్తే మొత్తం సాహిత్య రంగంలో ఉన్న స్త్రీలందరి స్ధితికి ఇది ప్రాతినిద్యం వహిస్తున్నది. ఇన్ని ఒత్తిడుల మధ్య, వ్యతిరేక పరిస్ధితుల మధ్య స్త్రీలు రచన చయాల్సి వస్తున్నది. కనుకనే వాళ్ళు అనుకున్నంత స్ధాయిలో వ్రాయలేదు. ప్రధాన స్రవంతి పురుష సాహిత్య ప్రపంచంలో తమకొక స్ధానాన్ని పొందలేదు. 1930ల నాటి ఈ స్ధితిని దాటి సాహిత్య ప్రపంచంలో స్త్రీల గమనం ఏ దిశగా సాగిందో, ఏ గమ్యాన్ని చేరిందో కళ్ళముందు వర్తమానంతో పోల్చి మనమిప్పుడు బేరీజు వేసుకోవలసి ఉన్నదీ. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good