పార్సీల పవిత్ర గ్రంథం జెంద్ అవెస్తా గురించి రాసిన వ్యాసంలో సమస్త ప్రాచీన ధర్మాలకు, మతాలకు వైదిక ధర్మమే లూలం' అనే విశ్వాసం భారతీయ సనాతన విద్వాంసులకున్నదని సూచించారు.
ఋగ్వేదం గురించి రాసిన వ్యాసం ఒక అవగాహన స్థూలంగా ఏర్పరచుకోవడానికి ఉపకరిస్తుంది. ఋగ్వేద ప్రాశస్త్యం కూడా కొంత వివరింపబడింది. ఋగ్వేదాది గ్రంథాలకు వ్రాయబడిన భాష్యాల గురించి కూడా కొంత సమాచారం తెలుపుతుందీ వ్యాసం. అదే విధంగా ఉపనిషత్తుల గురించి కూడా, ముఖ్య ఉపనిషత్తుల గురించి పరిచయ విశేష సమాచారం ఇవ్వబడింది. మువ్వల బహు గట్టిపిండం అని ఈ సంపుటిలోని వ్యాసాలు నిస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. వేదాంగాలైన శిక్ష, వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిషం గురించి, కల్పసూత్రాల గురించి తెలుసుకోవడానికి మంచి ఆకరంగా ఉంటుందీ వ్యాసం. పాదంలో ఉండే 'అక్షర సంఖ్యను బట్టి ఛందస్సు పేర్కొనబడుతుంది' అని చెప్పటమే కాకుండా ఛందశ్శాస్త్రాన్ని గురించి విపులంగా పేర్కొన్నారు.
పేజీలు : 197