ఇదొక చిన్న సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ వ్యాసాలు పండితుల కోసం వ్రాసినవి కావు! పూర్వ కవుల పరిచయం బాగా వున్న పాఠకుల కోసం వ్రాసినవీ కావు. ప్రబంధాలకూ, ప్రబంధ కవులకూ కొంచెం దూరమున్న వారికోసమే వ్రాయబడినవి.

    కాలాన్నిబట్టి, సంపర్కాలనుబట్టి, మనవారి అభిరుచులూ, అభిప్రాయాలూ మారుతున్నాయి. చూస్తూ వుంటే, మరి కొన్నేళ్ళలో ఈ కవుల పేరులూ, కావ్యాలూ అన్ని విస్మృతిలోపడి పోతాయనిపిస్తూంది. అలా జరగడం మంచిదికాదన్న  అభిప్రాయం కొందరితోపాటు నాకూ ఉంది. అది ఎదురీత అన్న విషయం తెలియకకాదు, మరి నాలుగు నాళ్ళయినా వాటి జ్ఞాపకం నిలపడానికి ప్రయత్నం చేయాలనే నా సంకల్పం.           - తాపీ ధర్మారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good