Rs.100.00
In Stock
-
+
అన్ని పార్శ్వాలను ప్రతిఫలించిన శేషేంద్ర కవిత్వం - డా. దిలావర్
ఒక అందమైన పోయెం అంటే
దానికి ఒక గుండె ఉండాలి
అది కన్నీళ్ళు కార్చాలి
క్రోధాగ్నులు పుక్కిలించాలి
పీడితుల పక్షం అవలంబించాలి
మనిషి రుణం తీర్చుకోవాలి
కాలపు బరువుల్ని మోయాలి
బ్రతకడానికి పద్యం ఒక
కోట బురుజు కావాలి
పద్యం మనిషి విజయానికి
ఒక జెండా అయి ఎగరాలి' అంటాడు.
పద్యం లక్షణాన్ని ఇంత అందంగా చెప్పినా తన మేనిఫెస్టోలో పీడిత పక్షపాతాన్ని విస్మరించలేదు. మనిషి రుణం తీర్చుకోవడంలో, కాలపు బరువు మోయడంలో తన కవిత్వాన్ని ఎక్కడా వెనుకడుగువేయనీయలేదు. అలాగని కవిత్వాన్ని నినాదప్రాయంగా మార్చి ఎక్కడా కవితా ద్రోహానికి తలపడలేదు.
Pages : 141