సాహితీ సుగంధం విమర్శవ్యాస సంపుటిలో వ్యాసాలు కొన్ని జాతీయ గోష్ఠులలో సమర్పితాలు. కొన్ని ఆకాశవాణిలో ప్రసారితాలు. సాక్షి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, సాహితీ ప్రస్థానం, గ్రంథాలయ సర్వస్వం వంటి పత్రికల్లో కొన్ని వ్యాసాలు ప్రచురితాలు.
'మన తొలి తెలుగురైతు కథ - ఎవరికి' వ్యాసాన్ని గురించి - నేను (పెనుగొండ) ''ఈతరం రైతు కథా మార్గదర్శి మట్టిగుండె'' అని పాపినేని శివశంకర్ కథానిక గురించి రాసిన వ్యాసంలో తెలుగులో తొలి రైతు కథానిక 'రెడ్డిరాణి' పత్రిక మే, 1924 సంచికలో ప్రచురితమైన శ్రీపాద సుబ్రహ్మాణ్యశాస్త్రి గారి 'రావులయ్య' అని వివరించాను. అయితే సుబ్బారావు గారు ''1912లో మాడపాటి హనుమంతరావు 'ఎవరికి' అనే కథ రాశారు. రైతు కథల మీద నేను చేస్తున్న పరిశోధన ప్రకారం దీనినే తొలి రైతు కథ అనుకోవచ్చు'' అన్నారు. ఖచ్ఛితంగా చెప్పలేకపోయారు. సుబ్బారావు గారి పరిశోధనా కృషిని స్వాగతిస్తున్నాను.
పేజీలు : 144