మధురవాణి వేశ్యావృత్తిలో ఉన్న వ్యక్తి. సంగీత సాహిత్యాలతో పరిచయం ఉంది. తల్లి పెంపకంలో సుశిక్షితురాలై మంచివారి ఎడల మంచిగాను, చెడ్డవారి ఎడల చెడ్డగానూ ప్రవర్తించమన్న తల్లిమాటలను విలువైన మాటలుగా గుర్తుంచుకున్నది. ఐతే చాలాసార్లు, ముఖ్యంగా స్త్రీలకు సహాయపడే సందర్భాలలో ఆమె తనపట్ల చెడ్డగా ఉన్నవారి పట్ల కూడా మంచిగానే ఉన్నది. తల్లి మాటలకు తన వివేకాన్ని కూడా జోడించి మానవ సంబంధాలలో ఎంత సున్నితంగా, అదే సమయంలో ఎంత ఆత్మగౌరవంతో ఉండవచ్చో మనకు నేర్పింది. మానవత్తం, ఆత్మగౌరవం, కార్యసాధన సామర్ధ్యం, చతురత, హాస్యప్రియత్వం, కత్తుల వంటి విమర్శలను పువ్వుల వలే విసరగల నేర్పు, ఎదుటివారు తనను అవమానిస్తున్నారని తోస్తే గొంతు నులమకుండానే వారికి ఊపిరాడకుండా చేయగల శక్తి తనను తాను కాచుకోగల ఒడుపు - యిలా ఎన్ని జీవ లక్షణాలనో నింపుకున్న సజీవమైన పాత్ర మదురవాణి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good