తెర తొలిగింది. అయిదు ఆకారాలు అస్పష్టంగా కానవస్తున్నాయ్‌. యిద్దరు సింహాసనంలా, ఒకరు పాదపీఠంలా, ఒకరు రాజుగారిలా, మరొకరు రాజుకు రక్షణగా పట్టిన ఛత్రంలా. వందిమాగధుల స్తుతులు దూరాన వినవస్తున్నాయ్‌.

    రాజాధిరాజ

    రవిరాజ విరాజితతేజ

    గండర గండాంక

    ఘనదాన చరిత

    అర్థి ప్రత్యర్థి

    దానగుణ హేమాద్రి

    కీర్తనీయ సకల సద్గుణ

    ఆర్తత్రాణ పరాయణ

    ధరణీ ధరేంద్ర

    శౌర్య విక్రమ కళాసంపూర్ణచంద్ర

    శ్రీశ్రీశ్రీ అనామక నామ నరేంద్ర

    బహుపరాక్‌, బహుపరాక్‌, బహుపరాక్‌.

    ఆకస్మాత్తుగా రాజుగారికి గుండెపోటు వచ్చింది. విల్లవిల్లాడి పోయాడు. సింహాసనం నుంచి క్రిందపడ్డాడు. క్షణాల తరువాత ప్రాణాలు విడిచాడు. మిగిలిన నలుగురూ మెల్లగా కదలికలోనికొచ్చారు. నల్గురూకలిసి రాజు శవాన్ని భుజాల కెత్తుకుని మెల్లగా ఎమ్‌.బి.లోకి నడుస్తున్నారు. ఆత్మశాంతి కోసం యెక్కడో మంత్రోచ్ఛారణ వినవస్తున్నది. రంగస్థలం చీకటయింది. ఆ ఆలాపన వినవస్తూనే వుంది. క్షణాల తర్వాత తిరిగి రంగం కాంతివంతమైంది. అది భారతదేశాన్ని గుర్తుకు తెచ్చే ఒక యిల్లు.  వెనుక తెరకువున్న రెండు ద్వారాల్లో ఎడమ ప్రక్కది సంపదకు, కుడిప్రక్కది దారిద్య్రానికి సంకేతాలుగా వున్నయ్‌. రెండింటి మధ్యన మరో వాకిలివున్నా అది వున్నట్టు కనిపించదు. కుడిప్రక్క వాకిటి సమీపంలో మూడు కుర్చీలున్నాయ్‌. ఎడమ వాకిటి ప్రక్కన ఒక కుర్చీ వుంది. మధ్యలో అధికారాన్ని సూచించే సింహాసనం వుంది. సింహాసనం వెనక ఊర్ధ్వ ముఖంగా చూస్తూ చైతన్య వున్నాడు. అతడి వెనుక అధోముఖంగా మరోదిక్కుకు చూస్తున్నాడు కౌటిల్య.......

Write a review

Note: HTML is not translated!
Bad           Good