Rs.70.00
Out Of Stock
-
+
కథ కవిత రెండు కళ్ళు నాకు. అవి నా లోకి నేను చూసుకోటానికి, ప్రపంచంలోకి చూడటానికి సాయపడ్డాయి. నా అనుభూతులు , ఆవేశాలు, ఆలోచనలు సాహిత్యంతో ముడిపడి ఉన్నాయి. రచన నాకేదో ఒక వ్యాపకం కాదు. ఒక రకంగా అది నా జీవిత సమస్య. జీవిత ప్రక్షాళన కూడా. ఒక కథో, కవితో నేను రాస్తున్నానంటే అది నా లోపలి పొరల్ని తవ్వి, శోధించి నా సంస్కారాన్ని, జ్ఞానాన్ని పరీక్షించి , నా ఆల్పత్వాన్నిక్షమిస్తూ ఉన్నతంగా రూపొందుతుంది. నాకన్న నా సాహిత్యం ఎత్తెక్కువ. అది నా ఆత్మోన్నతికి నేననుకున్న సాధనం. కథ గాని, కవిత గాని తాత్వికస్థాయికి తీసుకెళ్ళటం నా కిష్టం జీవిత తాత్వికత లేని రచన నేనూహించలేను . వాదాల కోసమో, ఉద్యమాల కోసమో నేనెప్పుడూ నావి కాని రచనలు చెయ్యలేదు. నా బాహ్యాం తర అనుభవాల పరిధిలోకి వచ్చిన వస్తువుల్నే తీసుకున్నాను.