పరమాత్మయే సమర్ధ సద్గురు వైన వారు శ్రీ షిరిడి సాయి బాబా. నేను శ్రీ సాయి మార్గంలో ప్రవేశమే సంహితాయని ద్విగురుసహస్రి అను గ్రంధమును చదువుటలో ప్రారంభ మైనది. ప్రతి రోజు రాత్రి నిదురించుటకు ముందే అందు ఒక అధ్యాయము చదువుచున్న సమయములో 1887 డిశంబర్ 31 మరియు 1988 జనవరి 1,2 తేదీలలో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి సాయి ప్రవచనములు గుంటూరు ఆర్. అగ్రహారము లోని శ్రీ సాయి సచ్చరిత్ర లోని 32 వ అధ్యాయములో నలుగురు బ్రహ్మమును వెదుకుటకు అరణ్యములో తిరుగుట గురించి చెప్పుతాను వినియుంటిని. అప్పటినుండి మానవునకు ఆద్యాత్మిక మార్గమున ఒక గురువు యుండుట అవసరమని, సరియైన గురువు ఎలా లభిస్తారా యని తపన ప్రారంభమైనది. జనవరి 13 వ రాత్రి తెల్లవారితే 14 వ తేది యనగా స్వప్నమున గురువు లభించలేదే యని కూర్చొని దుఖించుచూ వెనుదిరగ శ్రీ సాయి బాబా ఎఱ్ఱని వస్రములను ధరించి నుంచొని నన్ను ఆశీర్వదించు చున్నట్లు యుండ నేను వారి పాదములపై పాడుట ఆ స్వప్నమున కాంచి ఆనందము నొందు చుండ మేల్కంటిని .ఈ గ్రంధ రచనలో బాబా చూపిన ఆద్యాత్మిక లీలలు అవగతము చేయతలంపని మనవి చేయుచున్నాను. బాబా బోధలు, చేతలలో ఆధ్యాత్మిక చింతన తో జ్ఞాన మార్గమున నడచు లీలలకు బాబా నాకు స్పురింప చేసినంత వరకు అంతరార్ధమును తెలుప ప్రయత్నించినాను .
Rs.120.00
In Stock
-
+