భారత దేశంలో మొట్ట మొదటి బట్టలసబ్బును కనిపెట్టిందెవరు?

కుండలు చేస్తూనే మట్టి ఫలకాల మీద తొలిగా రాసిందెవరు?

ఇవాళ మనం తింటున్న ఆహారపదార్థాలను ఎంపిక చేసి, మనకు రుచులు నేర్పిందెవరు?

పత్తిని నూలుగా, బట్టగా మార్చే నేర్పు ఎక్కడి నుంచి వచ్చింది?

పచ్చితోళ్లను మన్నికైన లెదర్‌ పర్సులుగా, బెల్టులుగా, బ్యాగులుగా, బూట్లుగా మార్చే సైన్స్‌కు ఎవరు ఆద్యులు?

కంచ ఐలయ్య రాసిన ఈ పుస్తకం ఆదివాసీలు, పశువుల కాపరులు, తోలు పనివారు, కుమ్మర్లు, రైతులు, నేతపనివారు, చాకళ్లు, మంగళ్ల జీవనవృత్తుల్లోని శాస్త్ర విజ్ఞానాలనూ, కళా నైపుణ్యాలనూ మన కళ్ల ముందు సవివరంగా ఆవిష్కరిస్తుంది. తరతరాలుగా 'హీనమైన' 'అథమ' కులాలుగా వివక్షనూ, నిరాదరణనూ ఎదుర్కొంటున్న ఈ కులాల, వర్గాలవారు... వాస్తవానికి ఈ భూమి మీద మానవ జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు, మనిషి జీవితాన్ని సశాస్త్రీయమైన బాటలో నడిపించేందుకు ఎంతటి గొప్ప కృషి చేశారో తేటతెల్లం చేస్తుంది.

విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు విద్యార్థులు నిరసన ప్రదర్శనగా... బూట్లు తుడవటం, రోడ్లు ఊడ్వటం, కూరగాయలు అమ్మటం వంటి పనులు చేశారు. వీరికి శ్రమ పట్ల ఎందుకింత చిన్నచూపు? ఈ విద్యార్థులు నిజంగా బూట్లు కుట్టగలరా? నేల దున్నగలరా? కుండలు చెయ్యగలరా? మన భారతీయ పిల్లలకు... శ్రమను గౌరవించటమెలాగో నేర్పించే దిశగా మొట్టమొదటి ప్రయత్నం ఈ పుస్తకం! దుర్బాబాయ్‌ వ్యామ్‌ అపూర్వ చిత్రాలు... ఈ పుస్తకానికి మరింత జీవం పోశాయి. ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడు, తల్లి, తండ్రి తప్పక చదవాల్సిన పుస్తకమిది.

పేజీలు :108

Write a review

Note: HTML is not translated!
Bad           Good