పెట్టిన న్యాయస్థానములను బెట్టుచునేయున్నారు. వేసిన న్యాయాధిపతులను వేయుచునేయున్నారు. చేర్చుకొనిన న్యాయవాదులను జేర్చుకొనుచునేయున్నారు. పెరుగుచున్న వ్యాజ్యెములు పెరుగుచునే యున్నవి. పెంచుచున్న శిక్షాశాసన శాస్త్రములను బెంచుచునే యున్నారు. పెంచుచున్న రక్షకభట సంఖ్యను బెంచుచునే యున్నారు. పెరుగుచున్న నేరములు పెరుగుచునే యున్నావి. కట్టించుచున్న కారాగృహములను గట్టించుచునే యున్నారు. ఎదుగుచున్న కారాబద్ధుల సంఖ్య యెదుగుచునే యున్నది. నరహత్య చేసినవారిని జంపుటకు నానావిధ యంత్రములు కల్పించుచునే యున్నారు. హత్యలు వృద్ధియగుచునేయున్నవి.

నేరముల వెల్లడింతుము. వాని స్వభావముల విశదపఱతుము. వానివలన సంఘమునకు గల్గుహానిని స్పష్టపఱతుము. వానియందు జనుల కసహ్యము గల్గునట్లు సేయుటకై ప్రయత్నింతుము. నేరములనే మేము నిందింతుము. కాని యట్టి నేరములకు లోనయినవారిని నిందింపము.....

Write a review

Note: HTML is not translated!
Bad           Good