కాంచీపురము నగరాలలోకెల్లా ప్రసిద్ధి చెందిన పట్టణము. చరిత్రలో యదార్ధమైన, ఆధ్యాత్మికమైన స్థానము సంపాదించుకొన్న ప్రత్యేకమైన ప్రదేశము. ఎంతోమంది విద్యార్ధులు వేదాలు చదివి పండితులయ్యారు. వీటిని మించిలోకాతీత దైవమగు పూజ్యశ్రీ పరమాచార్యులు కాంచీ మఠ పీఠాధిపతిగా పొందిన ఖ్యాతి అతి విలువైనది.

మహాస్వామి కాంచీలో ఉన్నా, లేదా ఎక్కడకు వెళ్ళినా అది గొప్ప అనుభూతిగా ప్రజలు భావించి తరించేవారు. మహాస్వామి నయనాల లోంచి వెలువడే దైవశక్తితో కల్గిన అనుగ్రహము పొందేవారు.

నిజంగా మహాస్వాములకి మనము సమకాలీనులు అవటము మన అదృష్టము. శ్రీమఠంలో వారికి సన్నిహితులుగా ఉండే శిష్యులు, వాళ్ళ అనుభూతులు అందరితో పంచుకొనేవారు. మహాస్వామి భక్తుల ఆపదలు తీర్చి ధైర్యము చెప్పేవారు. మహాస్వామి లీలలు వింటుంటే రామాయణ, మహాభారతముల వలె ఒక గొప్ప పురాణాల్ని వింటున్నట్లుగా ఉంటుంది. మహాస్వామితో భక్తులకి కలిగిన అనుభవాలు పుస్తక రూపంలో తీసుకువచ్చినందుకు కృతఘ్నతలు. మహాస్వామి అనుభవాలు చదివితే గొప్ప ఆధ్యాత్మికమైన, నైతికమైన విలువలు ముందు తరాలకి తెలవాలని ఆశిస్తూ.. - రచయిత్రి

Pages : 102

Write a review

Note: HTML is not translated!
Bad           Good