శాకాహారమా? మాంసాహారమా? ఏది ఉత్తమం? ఏది అధమం? ఏది శ్రేష్టం లాంటి ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు ఈ చిరుపొత్తం. మానవ సమాజ పరిణామ క్రమంలో మనిషి ఉభయాహార జీవిగానే జీవించాడు. జంతువునో, పక్షినో చంపి తిన్నటువంటిది మాత్రమే మాంసాహారం కాదు. జంతువుల నుండి వచ్చే పదార్థాలు పాలు, పెరుగు, నెయ్యి వగైరాలన్నీ మాంసాహారాల కిందే లెక్క. ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని రచయిత బొర్రా గోవర్ధన్‌ శాస్త్రసమ్మతంగా వివరించారు. ఈ అంశంపై పలు కోణాల్లో చారిత్రకదృష్టి, శాస్త్రీయదృష్టి, నైతికదృస్టి, ధార్మికదృష్టి అంతిమంగా మానవీయదృష్టితోనూ పరిశీలన జరిపి, బౌద్ధ తాత్విక వెలుగులో హేతు బద్ధమైన ఆలోచనలను మనకు అందించారు.

Pages : 24

Write a review

Note: HTML is not translated!
Bad           Good