Rs.125.00
Out Of Stock
-
+
సాహిత్యవారధి' అనే ఈ వ్యాస సంపుటిలో 13 వ్యాసాలున్నాయి. వల్లభరావు ఇందులో హిందీ సాహితీమూర్తుల విశిష్ట పరిచయం చేశాడు. తెలుగునాట హిందీ చైతన్యం, కృష్ణాజిల్లాలో జరిగిన హిందీ ప్రచారోద్యమ విశేషాల్ని శ్రమకోర్చి సేకరించి వ్యాసాల రూపంలో అందించాడు. ఇవి లఘు సిద్ధాంత వ్యాసాల్లాగా ఉన్నాయి. వీటి రచనలో విషయ సేకరణ కోసం వల్లభరావు పడిన కష్టం. విశ్లేషణలో అతను చూపిన ప్రతిభ ప్రతి వాక్యంలోనూ కనిపిస్తుంది.
ఈ సంపుటిలో ఉన్న 'తెలుగు హిందీ కథ, ప్రారంభ వికాసాలు', హిందీ సాహిత్యంపై బౌద్ధం ప్రభావం, 'తెలుగు రచనలు హిందీ అనువాదాలు' అనే వ్యాసాలు పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథాల రచనకు ప్రాతిపదికల్లా ఉన్నాయి.
ఈ పుస్తకం హిందీ-తెలుగు సాహిత్యాల మధ్య వారధి నిర్మించేందుకు దోహదపడుతుందని విశ్వసిస్తున్నాను.
-ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్