ఇందులోని వ్యాసాలన్నీ యస్వీ రచించిన గ్రంథాలకు సంబంధించినవి. కవిగా, పరిశోధకునిగా, ఉపన్యాసకునిగా, విమర్శకునిగా, అభ్యుదయ ప్రస్థానంలో అతని ముద్రను విశ్లేషించేవి. ఈ వ్యాసకర్తలలో విమర్శరంగంలో లబ్ధప్రతిష్టులైన విమర్శకులున్నారు. ఎదుగుతున్న గుణగరిష్ఠులైన విమర్శకులూ ఉన్నారు. ఇది కేవలం యస్వీ భుజకీర్తులూ, భజనకీర్తనలు కోసం కాదు. ఆయా రచనల గుణగణ విశ్లేషణ, వాటి విలువను తెలియజెప్పే మూల్యాంకన.

Write a review

Note: HTML is not translated!
Bad           Good