ఇది దళిత సాహితీ యుగం, దళితుల తత్వశాస్త్రం. సాహితీ విమర్శ కూడా సజీవంగా రూపొందుతున్న యుగం. ఆంధ్రప్రదేశ్‌లో దళిత ఉద్యమానికి, దళిత సాహిత్య ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న డా|| కత్తి పద్మారావుగారు దళిత దృక్పథంతో తెలుగు నేలలో సాహిత్యం పండించిన కవులను, రచయితలను పదిమందిని సాకల్యంగా అధ్యయనం చేసి సమాజిక పరిణామానికి ఆ రచనలు ఎంత వరకు దోహదమవుతున్నదీ విశ్లేషించారు. బ్రాహ్మణసాహిత్యవాద విమర్శకు దళిత సాహిత్య వాద విమర్శ ప్రత్యామ్నాయం. ఈ ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించుకోవడానికి ఈ గ్రంథం ఉపకరిస్తుందని ఆశిస్తున్నాము. ఈ గ్రంథాన్ని డా|| కత్తి పద్మారావుగారు ముప్పది ఏండ్లకు ముందు వ్రాసింది. అయితే ఈ మూడు దశాబ్దాల పరిణామాలన్నింటినీ సమన్వయిస్తూ ఈ గ్రంథాన్ని ఆయన తిరిగి వ్రాశారు. ఈ క్రమంలో గ్రంథం ద్విగుణీకృతం అయ్యింది. తెలుగు సాహితీ వేత్తల, దళిత సాహితీ విమర్శకుల స్ఫూర్తి కోసం ఈ గ్రంథాన్ని అందిస్తున్నాం. - ప్రచురణకర్తలు

Write a review

Note: HTML is not translated!
Bad           Good