ఇవి కథలే అయినా, ఇందులో కల్పితాలు ఉండవచ్చు, యధార్థాలు ఉండవచ్చు. కాని ఆ వ్రాసిన విధానం మసకలు కప్పిన మన హృదయాన్ని తట్టి, మనలో ఇంకా అనుభూతులు, చలనాలు, కన్నీళ్ళూ ఉన్నాయని తెలియజెప్పాయి.

'విదారకం' కథ చదువుతుంటే నాకు కన్నీళ్ళు ఆగలేదు. ఈ రోజుల్లో కూడా కథలు చదివి కన్నీళ్ళు పెట్టుకుంటారా? అంటూ మీరు నవ్వుకోవచ్చు. ఈ కంప్యూటర్‌ యుగంలోని తల్లిదండ్రులు ఎంతమంది తమ పిల్లలని పట్టించుకోగలుగుతున్నారు? ప్రతిదానికీ పరుగు. లేచిన దగ్గర్నుంచి పడుకునేవరకూ పరుగే! 'విదారకం' కథలోని ఆ చిన్నతండ్రి అనుభవించిన బాధే ఎంతమంది పిల్లలు ఏదోరకంగా ఆ బాధలు అనుభవిస్తున్నారో కదా! ఇంట్లో అమ్మలు పట్టించుకోక, స్కూల్లో టీచర్స్‌ పట్టించుకోక ఆ చిన్నారులు ఎంత అయోమయస్థితుల్లో పడిపోతున్నారో! పిల్లలు పువ్వుల లాంటివారు. జాగ్రత్తగా చూసుకోండి.

'ఆరని దీపాలు' భర్త అంటే భరించేవాడు అంటారు. కాని భార్యకి ఎలాంటి నిర్వచనం చెప్పలేదు మన పెద్దలు. వాళ్ళ దృష్టిలో అప్పటి రోజుల్లో అంతే విలువ ఇచ్చేవారేమో. కాని భార్యంటే భర్తకోసం, బిడ్డలకోసం సర్వస్వాన్ని వదులుకోగలదు. ధన, ప్రాణ, మానం ఏదైనా సరే. ఈ కథలోని సీత బిడ్డ ఆకలి తీర్చటానికి తన జీవితాన్నే బలిచేసింది. బ్రిటీష్‌ కాలంలో ఇలాంటి సీతలు ఎంతమందో.

'ఎదుర్కోలు' ఈ కథ మనకి పెద్దపాఠమే చెబుతుంది. మన ఎదురుగా కన్పించే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం తెలిసి కూడా మనం ఎంత అశ్రద్ధ చేస్తామో కదా! సహాయం చేయదగ్గ అవకాశం, అంతస్తూ ఉండి కూడా చెయ్యలేము. అది మనకు చిన్న విషయం. అందుకే మీకేమాత్రం సహాయం చేసే అవకాశమున్నా ఆలస్యం చెయ్యకండి.

        'హస్తవాసి' 'వైద్యోనారాయణోహరి:' ఇది ఒక్కప్పటి మాట. ఇప్పుడు డబ్బున్న వాళ్ళకే వైద్యం అందుబాటులో ఉంది. మానవత్వం అనేది ఎక్కడా కన్పించటంలేదు. అలాంటి డాక్టరు ఓ నర్స్‌మాటలకి కనువిప్పు కలిగి చివరి నిమిషంలో పరివర్తన చెందటం 'చేతులు కాలాక ఆకులు పట్టుకున్న' విధంగా అయింది.

ప్రతి కథ మనసు పొరలను చీల్చుకొని కన్నీళ్ళను తెప్పించాయి.

పేజీలు : 192

Write a review

Note: HTML is not translated!
Bad           Good