"వీధి తలుపులు వేసి వచ్చిన యశ్వంత్ వెనక నుంచి విద్యా అని పిలిచాడు. విద్య అతనికి అభిముఖంగా తిరిగింది. ఆటను చేతులు  చాచాడు. ఈ సృష్టిలో వున్నా పురుషత్వం ,స్రీత్వానికి స్వగతం చెబుతున్నట్టుగా వుంది. అతని పెదవుల మీద చిరుదరహాసం, అతని కళ్ళలో చెప్పలేని ఆనందం. విద్య అతని దగ్గరికి వచ్చింది. విద్య కళ్ళలో ఈ ప్రపంచంలో అనాది నుంచీ స్రీకి పురుషుడి పట్ల  వుండే నమ్మకం, ప్రేమ ఉట్టిపడుతున్నాయి.
యశ్వంత్ అప్రయత్నంగా అంది. అతను విద్యని దగ్గరికి లాక్కున్నాడు. ఈ కాలం ఎప్పుడూ ఆగదు . ఒక్క స్రీ పురుషుల మనసులు గాడానురక్తితో కలిసినప్పుడు తప్ప..
విద్య వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. అమెరికా నుంచి వచ్చిన యశ్వంత్ కు చేరువ అవుతుంది. ఆశ్వంత్ పెంపుడు తల్లి కమేస్వరంమకి వద్యా యశ్వంత్ లు ఒక్కటవ్వటం ఇష్టం లేదు. ఆమె సృస్టించిన అపార్ధాలు వారిద్దరినీ దూరం చేస్తాయి. విద్య డైవోర్సు అడుగుతుంది. అయితే మళ్ళి జీవితంలో ఒకసారి వారిద్దరూ తారసపడతారు. అప్పుడే జరిగిందీ ! వారిరువురి నడుమ చోటు చేసుకున్న పొరపొచ్చాలు సంసిపోయాయా?
స్రీ పురుషుల తియ్యటి బాంధవ్యానికి అందమైన భాష్యం చెప్పే నవలామందారం ఋతువులు నవ్వాయి. మొదలు పెడితే తుది వరకూ ఏకబిగిని చదివించే పూచీ యద్దనపూడి సులోచనారాణి గారిదే. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good