గ్రామాల మధ్య దూరాలు ఎక్కువగా వుండటం. రవాణా సౌకర్యాల లేమి వల్ల వాణిజ్యమూ, నగరాలూ ఎక్కువగా అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కువమంది రష్యన్లది, ఇతర ర్గఆమాలతో సంబంధం లేని, ఒంటరి జీవితమే. పౌరసమాజం శకలాలుగా విడిపోయింది. వృత్తి పనివాళ్లూ, యంత్రాల గురించి తెలిసినవాళ్ళూ, వూళ్ళు తిరిగి వ్యాపారం చేసేవాళ్ళు, పారిశ్రామికవేత్తలూ - పదహారు, పద్దెనిమిది శతాబ్దాల మధ్య వాయువ్య యూరోప్లఓ పెట్టుబడిదారీ విధానం ఎదుగుదలకు తోడ్పడిన వాళ్ళు పాత రష్యాలో లేరనే చెప్పాలి. ''మధ్య యుగాలలో వ్యాపార, వృత్తి కేంద్రాలుగా వున్న నగరాల్లాంటివి రష్యాలో లేకపోవటం ఇక్కడి భూస్వాముల వెనకబాటుతనాన్నే కాదు, పాత రష్యన్‌ చరిత్రకు అద్దంపడుతున్నది.'' అన్నాడు రష్యన్‌ విప్లవ నాయకుడు, చరిత్రకారుడు లియోన్‌ ట్రాట్స్కీ.

పేజీలు : 166

Write a review

Note: HTML is not translated!
Bad           Good