జట్కాలకీ, సైకిళ్లకీ,
రిక్షాలకీ, మోటార్లకీ, రైలుబళ్లకీ
ఇత్యాది శకటాలకి
చక్రాలుంటాయ్ ప్రమాణపూర్తిగా, జరూ!
తన మేనల్లుడు ఆరుద్రతో కలిసి శ్రీశ్రీ చెప్పిన రుక్కుటేశ్వర శతకం (అసంపూర్ణం)లో ఆఖరిపద్యం ఇది. జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రికి ఈ శతకం అంకిత. ఆయన పేరు జ.రు. అదే జరూ అనే మకుట మయిందీ శతకానికి. జరూ అనే మాట ''గడురూ''కు పేరడి.
ప్రస్తుత పద్యం గణయతిప్రాస రహితంగా రచింపబడిన కంద పద్యం. చిన్నప్పుడు శ్రీశ్రీ ఇలాంటి పద్యమే రాశాడట. అది పోనే పోయింది. అది తెలియక రచించనది. ఇది తెలిసే రచించింది. అతి విచిత్ర కవిత్వాధ్వాయంలో ఒక మెరుపు.
ఛందస్సర్ప పరిష్ట&ంగం లోంచి సజీవంగా బ్రతికి వచ్చిన వికటకవి సాక్షాత్కరిస్తాడీ పద్యంలో....
పేజీలు : 31