కథకుడు పాత్రై, పాత్రలు వ్యక్తులై, వ్యక్తులు పాత్రలుగా మారిపోయే విచిత్రమైన కథ యిది...వుద్యమాలూ, ప్రతివుద్యమాలూ త్రాసులోని పళ్లాల్లా యెటు బరువెక్కువైతే అటు వూగుతూ వుంటాయి.  యెప్పుడో వొకనాటికి వాటి మధ్య తేడా తగ్గిపోతుందని ఆశిస్తాం...'డోలనం కథానికలో...

లిఫ్టు తలుపుల్ని మూయకుంటే ప్రమాదం...మనస్సుల తలుపుల్ని యెంతగా తెరవగలిగితే అంత ప్రమోదం...లిఫ్టు తలుపుల్ని మూయమని రికార్డెడ్‌ సందేశాన్ని మోగించినట్టే, మనస్సుల తలుపుల్ని తెరవమని చెప్పగలిగే సందేశమొకటి ప్రతి మనస్సు దగ్గరా అమరిస్తే యెంత బావుణ్ణోగదా! - 'దయ చేసి తలుపులు తెరవండి' నాటికలో...

యీ అపార్ట్‌మెంట్ల మధ్యలో కట్టిన గోడలెంతమదమో మీకు తెలియదు.  వొకరి ప్రైవసీలోకి యింకొకరు దూరకుండా వాక్యూమ్‌టైట్‌ గోడలున్నాయిక్కడ.  కిటికీలు తెరిస్తే లోపలేసుకున్న యేసీ వృథా అవుతుందని జాగ్రత్తపడతాం.  మాకున్న సమయం న్యూస్‌ పేపర్లు చదవడానికీ, టీవీ చూడ్డానికీ చాలటం లేదు.- 'చిత్రలేఖ' కథానికలో...

జీవిత శకలమొకటి కథగా రూపొంది, తర్వాత నాటికగా మారి, ఆ తర్వాత మరో కథగా రూపాంతరం చెందినప్పుడు కేవలం సాహిత్య ప్రయోగం మాత్రమే జరగదు.  అప్పుడు సమకాలీన సమాజాన్ని వేర్వేరు కోణాల నుంచీ అధ్యయనం చేయడం గూడా జరుగుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good