సైన్స్‌ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్. గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్‌కు కథా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కథకుడి కల్పన.

ఎవరికి, ఏదశలో తెలిసిన శాస్త్రజ్ఞానంతో వారు - రచయితలు - మొదటి నుంచీ సైన్సు ఫిక్షన్ సృస్టిస్తూనే ఉన్నా, ఇది బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం ఇరవయ్యో శతాబ్దంలోనే. ఆధునిక సైన్సుఫిక్షన్ రచయితలకు ఆద్యులుగా ముఖ్యంగా ఇద్దర్ని చెప్పుకోవాలి. ఫ్రెంచి రచయిత జూల్స్ వెర్న (ఫ్రం ఎర్త్ టు మూన్, ట్వెంటీ థౌజండ్ లీగ్స్ అండర్ ది సీ; ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ ఎయిటీ డేస్ వగైరా). ప్రత్యేకించి అమెరికాలో సైన్సుఫిక్షన్ కథలకు మంచి క్రేజ్ వుంది. అనేక పత్రికలు, ప్రచురణ సంస్థలు వీటి పాపులారిటీని పెంచుతున్నాయి. రష్యన్ అర్కాడే బొరిస్ స్ట్రగాట్‌స్కీ; స్టానిస్లా లెమ్ (పోలెండ్); సాక్యో కోమాట్సూ (జపాన్) హూర్హెలు లూస్ బోర్హెస్ (అర్జెంటీనా). ఆర్థర్ సి. క్లార్, ఐజాక్ రసిమోవ్, రే బ్రడ్‌బరీ ప్రముఖ సైన్సు ఫిక్షన్ రచయితలు. సాహిత్యంలో కన్నా, దృశ్య మాధ్యమంలో ఈ ప్రక్రియ ఎక్కువ జనాకర్షకంగా పరిణితి చెందింది. స్టార్ ట్రెక్ (టివి సీరియల్) స్టార్ వార్స్ సినిమాలు (జార్జ్ లుకాక్స్); కుబ్రిక్ తీసిన 2001; ఎ స్పేస్ ఒడిసీ - ఐ, రోబో ఇందుకు ఉదాహరణలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good