‘రాబిన్సన్‌ క్రూసో’ అనే ఈ నవలిక ‘డేనియల్‌ డెఫో’ రాసిన పుస్తకాలలో ప్రసిద్ధమైనది. ఈ కథ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కథానాయకుని పేరు రాబిన్సన్‌ క్రూసో. నావికుడిగా ప్రపంచాన్ని చుట్టిరావాలనే కోరికతో ఓడమీద బయలుదేరతాడు. అలా ప్రయాణిస్తున్న వేళ భయంకరమైన తుపానులో చిక్కుకుని ఓడ మునిగిపోతుంది. తనొక్కడు మాత్రం అదృష్టవశాన ఒక నిర్జన ద్వీపంలో చిక్కుకున్నాడు. బయటి ప్రపంచంతో సంబంధంలేని ప్రదేశం, చుట్టూ క్రూరమృగాలు. అలాంటి ప్రదేశంలో ఒక ఆశ్రయాన్ని నిర్మించుకోవటానికి అతడు చేసే పోరాటం, పంటలు పండించటానికి, అడవి జంతువులను మచ్చిక చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు, అక్కడ ఒక అనుచరుణ్ణి సంపాదించుకోవటానికి పడ్డ తపన, అడవి మనుషులతో పోరాటం, చివరకు నాగరిక ప్రపంచానికి సుమారు 27 సంవత్సరాల తరువాత చేరుకోవడం ` ఈ సాహసోపేత ప్రయాణం మనల్ని అబ్బురపరుస్తుంది.

రాబిన్సన్‌ క్రూసో నేటి బాలబాలికలకు ఆదర్శ పాత్ర. జీవితంలో వచ్చే వడిదుడుకులను ధైర్య సాహసాలతో ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తుంది. ఈ చిన్ని నవలిక మనకు అన్వేషణ, సాహసం, ఆశావాదం, ఆత్మవిశ్వాసం ఎలా ప్రోది చేసుకోవాలో నేర్పుతుంది.

పేజీలు : 40

Write a review

Note: HTML is not translated!
Bad           Good