ఇప్పుడు అప్పల రాజు గారు వెలువరిస్తున్న ఈ దీర్ఘ కవిత రోడ్లు విస్తరణ ఇబ్బందులపైనే కాదు, మానవాళికి భిన్నకోణాల్లో ముంచుకొస్తున్న కీడు, ఇక్కట్లపై కూడా కలమెత్తారు. రహదారుల విస్తరణ పెద్ద ఎగుమతి, దిగుమతి వ్యాపారులకు వరంగా మారితే, సగటు మానవులకు అగచాట్లు అధికమౌతున్న వైనాన్ని వెల్లడించారు. పట్టణాలకు వలస ఉధృతి పెరగడం జీవన సమతౌల్యానికి గొడ్డలి పెట్టుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. రహదారుల విస్తరణ, నిర్వహణా విధానాన్ని గూర్చి ఆద్యంతం కావ్య రచన సాగింది. విలక్షణమైన ఇతి వృత్తాన్ని స్వీకరించి సలక్షణంగా చేసిన సంవేదన అభినందనీయం. రహదారుల విస్తరణ అవసరాల్ని గుర్తిస్తూనే, వాటి నిర్మాణ నిర్వహణలోని లోపాలపై నిశిత విమర్శగావించడం కవి కర్తవ్యంగా సాక్షాత్కరిస్తుంది. సమాజానికి ముప్పేటా ముంచుకొచ్చే ప్రమాదాల నివారణ అందరి బాధ్యతని రసబంధురమైన కవిత్వంలో ప్రబోధించిన అప్పల రాజు గారు రహదారులున్నంత వరకు అభినందనీయులే.
- ఆచార్య కొండపల్లి సుదర్శన రాజు

Write a review

Note: HTML is not translated!
Bad           Good