ధనికులు అవాలనుకునేవారు ఆదాయాన్ని అధికంగా సంపాదించాలి అనే కట్టుకధని పటాపంచలు చేస్తుంది.

మీ ఇంటిని మీకొక  ఆస్ది అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది.

తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించటానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు తెలియజేస్తుంది.

మీ పిల్లలు భవిష్యత్తులో ఆర్ధికంఆ విజయం సాధించడానికి, వాళ్ళకు ఏం నేర్పాలో మీకు బోధిస్తుంది.

రాబర్ట్‌ కియోసాకీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జనానికి డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చారు. సూటిగా మాట్లాడటం లోనూ, ధైర్యంగా మూసభావాలని ఎదుర్కోవడంలోనూ అతను చాలా పేరు పొందారు. తరచూ అతని వైకరి సాంప్రదాయక నివేశాన్ని ధైర్యంగా ఖండిస్తుంటుంది. ఆర్ధిక స్వాతంత్య్రాన్ని ఆవేశపూరితంగా సమర్ధించే వ్యక్తిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

''జనం డబ్బు కోసం కష్టాలు పడటానికి ముఖ్యకారణం వాళ్ళు ఎన్నో ఏళ్ళు విద్యాలయాల్లో చదువుకున్నప్పటికీ, డబ్బు గురించి అక్కడ ఏమీ నేర్చుకోకపోవడమే. దాని ఫలితం - వాళ్ళు డబ్బు కోసం పనిచేయడం నేర్చుకుంటారు... కానీ డబ్బు చేత పనిచేయించడం వాళెన్నడూ నేర్చుకోరు''. - రాబర్ట్‌ కియోసాకీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good