తెరాయి దస్తావేజులుగా సుప్రసిద్ధమైన ఈ ఎనిమిది డాక్యుమెంట్లను కామ్రేడ్ చారుమంజుందార్ 1965-67 మధ్య కాంలో రాశాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సిపిఐ (ఎం) ఏర్పడినప్పుడు ప్రజలందరూ, ముఖ్యంగా విప్లవ శ్రేణులు వర్గపోరాటం మళ్ళీ ఎజెండా మీదికి వస్తుందని ఆశించారు. విప్లవాత్మక ప్రతిఘటన - సాయుధ పోరాటం అనే మాటలను దుస్సాహసికంగా భావించే నాటి కాలంలో కామ్రేడ్ చారుమంజుందార్ ఈ డాక్యుమెంట్లను రాశాడు. విప్లవ పార్టీ నిర్మాణ ఆవశ్యకతను ప్రతిపాదించారు. భారతదేశాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య దేశంగా గుర్తిస్తూ ఇక్కడ రైతులు విప్లవానికి ప్రధాన శక్తి అని, వర్గపోరాట ప్రాతిపదికపై మాత్రమే కార్మిక కర్షక ఐక్యత సాధ్యం అని చెబుతాడు. రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి గ్రామాలను విముక్తం చేసి విముక్త ప్రాంతాల నిర్మాణానికి కృషి చేయాలంటాడు. ఇవాళ క్రాంతికారీ జనతన సర్కార్ ఆచరణలో ప్రతిపాదిస్తున్న ఈ ఆలోచనలను మళ్లీ మళ్లీ మననం చేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. |