ఇక్కడ కులమే వర్గం. చాకలి కులానిది అట్టడుతు ఆర్థిక వర్గమైతే రెడ్లది ఉన్నత ఆర్థిక వర్గం. కుమ్మరోనిది అట్టడుగు ఆర్థిక వర్గమైతే కోమట్లది ఉన్నత ఆర్థిక వర్గం. మాదిగలది అట్టడుగు ఆర్థిక వర్గమైతే బ్రాహ్మణులది ఉన్నత ఆర్థిక వర్గం. కులాల మధ్య ఇంత స్పష్టమైన వర్గపు తేడాలకు కళ్లు మూసుకుని, దేశంలో లేని వర్గం కోసం పోరాడటం దేశీయ మార్క్సిజమ్ కాదు.... ఇక్కడ ప్రతి కులానికీ ఒక పురాణం ఉంది. ఒక చరిత్ర ఉంది. ఆర్థికస్థాయి ఉంది. సాంస్కృతిక నిర్మాణం వుంది. ఇవన్నీ కులాల మధ్య వైవిధ్యాలు. ఇట్లాంటి ఏ వైవిధ్యాలు లేని ఏకమైన ముద్దగా అట్టడుగు ఆర్థికవర్గం రూపొందాలనుకోవడం ఐరోపీయ భావన మాత్రమే? ప్రతి అట్టడుగుకులమూ తన సాంస్కృతిక వైవిధ్యాన్ని తాను పోషించుకుంటూనే మిగతా అట్టడుగు కులాలతో కలిసి ఒక రాజకీయ ఎజెండా కింద ఐక్యం కావడమే నేడు బహుజన తాత్వికత కోరుకుంటున్నది.
పేజీలు : 180