యుద్ధాలకు మూలకారణమైన సామ్రాజ్యవాదం ఓడించబడేంత వరకు సోషలిస్టు రష్యా అనుభవాలను మరింతగా పరిశీలించి పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పెట్టుబడిదారీ సంక్షోభాలపై మార్క్సిస్టు  లెనినిస్టు అర్థశాస్త్రం చూపిన పరిష్కారాలపై కొత్తతరం మరొక్కసారి దృష్టిసారించిందన్న తాజా వాస్తవం మనందరికీ తెలుసు. మొట్టమొదటి సోషలిస్టు వ్యవస్ధను నిర్మించుకున్న రష్యాను సర్వనాశనం చేయటానికి జరిగిన ప్రయత్నాలను ఆ దేశ ప్రజలు అసమాన త్యాగాలతో ఎలా తిప్పి కొట్టగలిగారో ఈ తరం తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. చారిత్రక వాస్తవాలకు సరైన దృక్పథంతో పరిశీలించి వర్తమాన ప్రజా పోరాటాలకు అన్వయించుకోవటానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good