కథా రచయితగా నరేంద్రకు రెండు ప్రత్యేక లక్షణాలున్నాయి. మొదటిది శిల్పం మీద అతనికున్న నియంత్రణ. రెండవది రచయితగా తనని తాను నిగ్రహించుకోవడం.. కథలో పాత్రపోషణకు అవకాశం తక్కువే అయినా, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వచ్చే పాత్రల్ని తీసుకుని, వాటిని వస్తునిష్టంగా - ఆబ్జెక్టివ్గా - పోషిస్తాడు.
- వల్లంపాటి వెంకటసుబ్బయ్య
* * *
నరేంద్ర కథా ప్రపంచం జీవితంలోకి బహుళత్వాన్ని పరిచయం చేస్తుంది. వైరుధ్యాల్ని ఆకళింపు చేసుకోడానికి తోడ్పడుతుంది. ఆయన కథల్లో సామాజిక జీవితంలోని బహుళ పార్శ్వాలు విరాట్రూపంలో ఆవిష్కృతమవుతాయి... ఆయన కథల్లో వస్తుశిల్పాలను విడదీసి చూడడానికి వీల్లేనంతగా ఐక్యతవుంది... మరోవిధంగా చెప్పడానికి వీల్లేని రీతిలో కథను నిర్మించడంలో ఒక శిల్పకారునిగా దర్శనమిస్తాడు నరేంద్ర... ఆయన కథల్ని చదవడం ఒక ఉద్వేగపూరితమైన అనుభవం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good