ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలని చాలామందికి ఉండదు. తెలుసుకోలేరు.

మంచి జరగాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వాటిలో ముఖ్యమైనదీ, మనకు అదృష్టాన్ని తెచ్చేది నామ సంఖ్యలో మార్పు.

సంఖ్యలు మన జీవితంలో ఎన్నో రకాల విన్యాసాలు చేస్తాయి. అవి మనకు ఎంత ఉపయోగపడతాయో ఈ పుస్తకం ద్వారా పాఠలు తెలుసుకోవచ్చు.

1 నుండి 108 నామ సంఖ్యల వివరణ సంఖ్యా శాస్త్రం గురించి తెలుసుకోవాలనే వారి దాహాన్ని తీరుస్తుంది.

సూక్ష్మంగా సంఖ్యాశాస్త్రం (న్యూమరాలజీ) పై అవగాహన కలిగించడం ఈ పుస్తకం ముఖ్య ఉద్దేశం.

నామ సంఖ్యలో మార్పు అదృష్టం గురించే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలను, మనో వ్యాధులను నివారిస్తుంది.

''ఏ సంఖ్యలో ఏముంది'' అనే పుస్తకం రచయిత యొక్క అభిమానుల శ్రేయోభిలాషుల చిరకాల కోరిక. సంఖ్యాశాస్త్ర వివరణ పాఠకుల యొక్క జిజ్ఞాశను తీరుస్తుంది, మంచి అవగాహన కల్గిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good