వేలాది శివాలయాలలో కొన్ని మానవప్రతిష్ఠలు, కొన్ని ఋషిముని ప్రతిష్ఠలు కాగా మరికొన్ని దైవప్రతిష్ఠిత లింగాలు కూడా వున్నాయి. అయితే వీటన్నిటి కన్నా ఎంతో శక్తివంతమైన లింగాలు మరికొన్ని ఉన్నాయి. అవే ద్వాదశ జ్యోతిర్లింగాలు.

ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఇంతటి ప్రశస్తి మహిమ కలగటానికి కారణం ఇవి సాక్షాత్తు పరమేశ్వరుడి ఆత్మ జ్యోతి నుంచి ఆవిర్భవించినవి కావటమే. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కనీసం ఒక్క జ్యోతిర్లింగాన్నైనా దర్శిస్తే పాపాల నుంచి విముక్తి పొందవచ్చునని పురాణాలు ఘోషిస్తాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good