శ్రీ కనకదుర్గమ్మ వారి క్షేత్ర పురాణము

శక్తి స్వరూపిణి...త్రైలోక్య సంచారిణి... వేదమాత...అమ్మలగన్నయమ్మ...ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకొంటూషోడశాక్షరీ మంత్రానికి అధిష్టానదేవతగా, శ్రీచక్ర నీరాజనాలందుకునే అపరాజితగా కొలువులందుకునే తల్లి, ఇంద్రాది దేవతలచే పూజలందుకొంటూ ఇంద్రకీలాద్రిపై స్వయంభువైన దేవి శ్రీకనకదుర్గాదేవి.

ఆలయ విశిష్టతలు

దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యతగల కృతయుగం నాటి కోవెల అతి ప్రాచీనమైన శక్తి పీఠం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం.

దర్శన ఫలం

సృష్టి, స్థితి, లయకారిణియైన త్రిశక్తిస్వరూపిణి మన దుర్గమ్మ. దయామృత వర్షిణి అయిన ఆ జగన్మాతను మనసారా ఆరాధించి ఆ తల్లి చరణాల్ని ఆశ్రయిస్తే మనకున్న దుర్గతుల్ని నశింపచేసి సద్గతుల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

శరన్నవరాత్రులు ఎంతో శక్తివంతమైనవి. శుభప్రదమైనవి. మంగళకరమైనవి. వివిధాలంకార భూషితయైన అమ్మవారిని దర్శించి, కరుణా కటాక్ష వీక్షణాల్ని పొందుదాం....

Write a review

Note: HTML is not translated!
Bad           Good