పరమ పావని భూమి భారతావని. ఇది పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, అర్షమైన భారతీయ విజ్ఞానం సకల విశ్వానికి ప్రధమ సూర్యోదయం.

పుట్టిన ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సమయంలో తానెవరు? ఈ ప్రపంచం ఏమిటి? తనకు ఈ ప్రపంచానికి ఏమిటి సంబంధం? ఈ ప్రపంచాన్ని, తనని సృష్టించినవాడు ఎవడు? తనకు కలిగే సుఖ దు:ఖాలకు కారణం ఏమిటి? తన చరమ లక్ష్యం ఏమిటి? అనే ఆలోచనలు వస్తాయి. రావాలి కూడా. అతడి విచారాల సారాంశాలే వేదాంత శాస్త్రాలు.

ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలంటే ఇష్టం. వాటిల్లో ఏమున్నాయి. అవి ఏం చెపుతున్నాయి అని తెలుసుకోవాలనే జిజ్ఞాస బలంగా ఉండేది. విధి నిర్వహణలో కొంత వీలుకాకపోయినా, ఉద్యోగ విరమణానంతరం నాలో అణిగివున్న తపన, సాహిత్య చైతన్యం ప్రజ్వరిల్లి, మొలకెత్తి, చిగురించటం వలన, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ శ్రద్ధతో అందుబాటులో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలను పఠనం చేసే సదవకాశం కలిగింది. పదవీ విరమణ ఉద్యోగానికి కాని వయసుకు అభిరుచులకు కాదు కదా!

ఈ క్రమంలో ఎన్నో సందేహాలు, సంశయాలు వచ్చేవి. ఆధ్యాత్మిక మనస్తాపం కలిగిన సందర్భాలూ లేకపోలేదు. ఆలోచించడం బుద్ధిజీవుల లక్షణం. విజ్ఞానానికి మూలం ప్రశ్న. తెలుసుకోవాలనే తృష్ణకు బీజం సందేహం. సందేహాలు ప్రతి వ్యక్తికి వచ్చినా, కొంతమంది వాటిని బయటకు వ్యక్తం చేయరు. కొంతమంది మాత్రమే వాటిని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. జ్ఞానం అనేది ఒక యజ్ఞం వంటిది. జ్ఞాన సముపార్జనతో సంశయాలు నివృత్తి చేసుకోవాలని (గీత 4 అ|| 41 శ్లో||) భగవత్తత్త్వ మెట్టిదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలని (7/16 శ్లో||) శ్రీకృష్ణపరమాత్మ చెప్పియున్నాడు. తత్త్వమును తెలిసికోవాలనే అభిలాషతో చేసే రాగద్వేషరహితమగు వాదన, ప్రశ్నోత్తరాదులు తానని భగవంతుడు చెప్పియున్నాడు (గీత 10/32 శ్లో||).... రచయిత విష్ణుభట్ల అచ్యుతరామశర్మ

పేజీలు : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good