తనని తాను శోధించుకోవడం మొదలెట్టిన ప్రతి మనిషీ మహాత్ముడవుతాడు. కానీ ముక్కు మూసుకుని తనని తాను శోధించుకుంటూ కూర్చోవడానికి క్షణం కూడా తీరిక లేని జీవనశైలిలో మనల్ని ఆవిష్కరించుకోవడానికి సులవైన మార్గం ఏదైనా వుందీ అంటే ప్రతి క్షణం మన మెదడు పొరల్లో రసాయనిక చర్యల ద్వారా బుద్ధి ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి అయ్యే ఆలోచనా స్రవంతిపై ఓ కన్నేసి ఉంచడమే. దీనికి తీరిక అవసరం లేదు. కొద్దిపాటి నిశితమైన గమనింపు చాలు. అన్నీ అర్థమవుతాయి. మన నోటి నుంచి వచ్చే మాటల దగ్గరనుంచి..మన మనస్సులో ఓ చోట ప్రారంభమై సుడులు తిరుగుతూ ఓ మనోవికారంగా బయటపడే ఆలోచనల వరకూ అన్నింటి గమనమూ స్పష్టంగా తెలుస్తుంది. 

ఈ ప్రజ్ఞ చాలు, జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించడానికి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకుని అందరితో జీవితాంతం సంతోషంగా ఉండడానికీ.

అన్నీ గెలవడమే విజయం కాదు. చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు గెలవడం గురించే చెప్తాయి. జీవితంలో గెలుపొక్కటే ఉండదు. ఓటమీ ఉంటుంది. ఓటమే కాదు. గెలుపు ఓటములకు మధ్య రకరకాల భావ సంఘర్షణలు ఉంటాయి. వాటిని ఏ పుస్తకమూ పెద్దగా స్పృశించదు. కానీ ఈ పుస్తకంలో అవి కళ్ళకు కట్టినట్లు చూపించబడతాయి. మనిషి పుట్టీ... చనిపోవడం ఓ  జీవితం అనుకుంటే ఆ జీవితాన్ని ఏ మానసిక స్థితిలోనైనా సంతోషంగా ఉంచేలా..పరిపక్వతతో మెలిగేలా ఆలోచింపజెయ్యడమే ఈ పుస్తకం 'రిలేషన్స్‌' యొక్క ప్రధాన ఉద్దేశం.- నల్లమోతు శ్రీధర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good