అనేక రకాల సంకుచిత సంచులలో మనుషులు దాక్కుంటున్న సమయంలో గురజాడ లాగా, జాషువా లాగా, శ్రీశ్రీ లాగా ఇంకా వెనక్కిపోతే వేమన లాగా శివప్రసాద్‌, విశ్వమానవుణ్ణి నేను, వసుధైక కుటుంబం నాది, మానవత్వం నా కులం, సమానత్వం నా మతం అంటున్నారు. ఇదో మరో ప్రపంచ స్వప్నం. శివప్రసాద్‌ నేటి సమాజం ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలను, సమస్యలను ప్రతిబింబించి అవి లేని మంచి సమాజం పుట్టాలని కోరుకున్నారు. ఈయనకు కవిత్వం పట్ల గౌరవమే కాదు, ఆరాధనా భావం కూడా ఉంది. - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

కవిత్వం నా జీవలక్షణమని తన తత్వాన్ని తెల్పిన శివప్రసాద్‌ గారు సృజన కార్యక్రమాన్ని ఊపిరిగా జీవిస్తున్న వారు. ఈ కవితా సంపుటిలో వస్తు వైవిధ్యం ఉంది. ఈయనలో పరిశీలనా దృక్పధం ఉంది. భావుకత ఉంది. అభివ్యక్తి నైపుణ్యం ఉంది. ఈ మూడు శక్తుల సంగమమే రెక్కలు కావాలి కవితా సంపుటి. - డా|| గుమ్మా సాంబశివరావు

పేజీలు : 102

Write a review

Note: HTML is not translated!
Bad           Good