రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ సైన్స్‌ అత్యంత ముఖ్యమైన విజ్ఞానశాస్త్రం. సాధారణ ప్రకృతి నియమం ప్రకారం ఉష్ణం స్థాయి ఎక్కువగా వున్న చోట నుంచి తక్కువ వున్న చోటుకి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అయితే యంత్ర శక్తిని వుపయోగించి తక్కువ టెంపరేచర్‌ వున్న ప్రదేశం నుంచి వేడిమిని ఎక్కువ టెంపరేచర్‌ వున్న ప్రదేశానికి ట్రాన్స్‌ఫర్‌ చేసే విధానం గురించి వివరించే శాస్త్రమే 'రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌'.

ఆధునిక జీవితంలో రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనరింగ్‌లకి వున్న ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఫ్రిజ్‌లు, ఏ.సి.మెషిన్‌లు లేని ఇళ్ళు చాలా తక్కువగా కనబడతాయి. ఇంకా ఆఫీసుల్లో, కర్మాగారాల్లో అయితే మరీ ఎక్కువ మొత్తంలో ఇవి దర్శనమిస్తూ వుంటాయ్‌. వీటిని అమర్చడం, రిపేర్లు వచ్చినప్పుడు బాగు చెయ్యడం ఏ.సి. మెకానిక్‌ల ముఖ్యమైన పని.

అందుకే ఈ బుక్‌లో ఒక ఏ.సి. మెకానిక్‌కి అవసరమైన అడ్వాన్స్‌డ్‌ ఇన్ఫర్మేషన్‌ కూడా పొందుపరచడం జరిగింది. డక్ట్‌బుల్‌ మెషిన్స్‌, వేపర్‌ అబ్జార్షన్‌ సిస్టమ్స్‌, సెంట్రలయిజ్డ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ మొదలైన అంశాలు కూడా ఇందులో ప్రస్తావించడం జరిగింది.

పేజీలు : 224

Write a review

Note: HTML is not translated!
Bad           Good