రెడ్డి రాజ్యాల గురించీ, వివిధ రెడ్డి సంస్ధానాల గురించీ చరిత్ర గ్రంథాలు కొన్ని వెలువడ్డాయి. రెడ్డి రాజులకు సంబంధించిన దాదాపు 200 శాసనాలు వెలుగు చూశాయి. రెడ్డి రాజులు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాలు, అపురూపమైన వాస్తు, శిల్ప సంపద కొంత పరిచతమయ్యాయి.
రెడ్డి రాజుల కళా, సాహిత్య పోషణ, వారి కాలం నాటి సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక స్థితిగతులు, వివిధ రాజుల వ్యక్తిత్వ విశేషాలు - వీటిని గురించి చర్చించిన అపూర్వ పరిశోధక గ్రంథం మల్లపల్లి సోమశేఖరశర్మ ఇంగ్లీషులో రచించిన 'హిస్టరీ ఆఫ్‌ ది రెడ్డి కింగడమ్స్‌'. (సుమారు క్రీ.శ. 1325-1448). ఈ గ్రంథాన్ని 1948లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించింది. మా అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య 1993లో పునర్ముద్రించింది. ఇప్పుడు ఈ తెలుగు అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
ఈ గ్రంథంలో దాదాపు 125 సంవత్సరాల రెడ్డి రాజ్యాల కాలంలోని సమాజ చరిత్ర చిత్రణ కన్పిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good