ఈ పరిశోధక గ్రంథంలో పరిశోధకుడి శ్రమ ఒక విధంగా వెలకట్టలేనిది. నవలా రచయితల జీవిత విశేషాలను, రచనలను సేకరించడం ఇప్పట్లో అంత సులభమైన విషయం కాదు. రాయలసీమ ఆధునిక సాహిత్య చరిత్ర పునర్నిర్మాణానికి, పునర్లేఖనానికి ఈ పరిశోధన కొంత దోహదం చేస్తుంది. - ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

    1950కి ముందు వచ్చిన నవలల్ని నాగరాజు విశ్లేషించడం చదివితే నవల విషయంలో రాయలసీమ ఇప్పటిదాకా అందరూ అనుకుంటున్నంతగా వెనకబడి పోలేదు అన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు, తెలుగు నవలా చరిత్రను తిరిగి రాయవలసిన అవసరాన్ని కూడా ఈ గ్రంథం నొక్కి చెబుతోంది. - ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

        ఈ నవలల్లో రాయలసీమ సమాజానికి సంబంధించిన వాస్తవాలను మనముందుంచాడు. అవి సీమలో మండే ఎండలు కావచ్చు, గ్రామాలలో కోపాలు, తాపాలతో చేసుకొనే ఖూనీలు కావచ్చు. కరణాల, మున్సబుల మధ్య వైరుధ్యాలు కావచ్చు, జాతరలు, తిరునాళ్ళు, పారువేట, కోడిపందేలు, క్రీడలు, సతీసహగమనం, దళితపీడన కావచ్చు. పల్లెల - పట్నాల మధ్య తేడాలు కావచ్చు, విద్యావంతులు, నిరక్షరాస్యుల మధ్య ఉండే అంతరాలు కావచ్చు. ఇట్లాంటివి నాగరాజు కానీ, భావి పరిశోధకులు కానీ మానవ విజ్ఞాన దృష్టితో, సామాజిక విజ్ఞాన దృష్టితో, రాజకీయార్థిక శాస్త్ర దృష్టితో పరిశీలించడానికి అవకాశం ఉంది. - కేతు విశ్వనాథ్‌ రెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good