రాయలసీమలో కరువును గురించి ఒక్క కథయినా రాయని కథకుడు ఎవరూ వుండరు. కొందరు కరువు వివిధ పార్శ్వాలను స్పృశిస్తూ ఒకటి కంటే ఎక్కువ కథలు గూడా రాశారు. అంఉకే ఒక రచయిత రాసిన ఒక కథను మాత్రమే ప్రచురిస్తున్న ఈ పుస్తకం సమగ్ర సంకలనమేమీ కాదు. వివిధ దశల్లో వచ్చిన, నాకు నచ్చిన కొన్ని కథల్ని మాత్రమే ఈ సంకలనంలోకి తీసుకున్నాను.  కొన్ని కథలు నా దృష్టికి వచ్చినా రచయితల నుంచి సకాలంలో అందకపోవడం చేత, నేను నిర్దేశించుకున్న పేజీలు దాటిపోవడం చేత ప్రచురించలేక పోయాను. 

ఈ సంకలనంలో కేవలం రాయలసీమ రచయితలు రచించిన కథలు మాత్రమే తీసుకున్నప్పటికీ, రాయలసీమ కరువును మొట్టమొదటిసారిగా చిత్రించిన చింతా దీక్షితులుగారి సుగాళీ కుటుంబం కథను కూడా చారిత్రక ప్రాముఖ్యత దృష్ట్యా అనుబంధంలో ఇవ్వడం జరిగింది....

పేజీలు : 400

Write a review

Note: HTML is not translated!
Bad           Good