చూడూ! నువ్వు నా ఆరోప్రాణం. ఇన్నాళ్ళు ఎలా బ్రతికానో నాకు తెలీదు. నువ్వు లేకుండా ఇక ముందు బతకడం మాత్రం నాకు సాధ్యం కాదు."
ఆ వెన్నెల రాత్రి వెలగచెట్టు నీడలో అలా చాలాసేపు మాట్లాడింది రాజకుమారి.
'అంత గొప్పమనిషి అనుకోకుండా నా ప్రాణంలో ప్రాణం అయింది. ఈ మనిషికి దగ్గరయ్యాను. సరే దక్కించు కోగలనా చివరికి?' అనుకున్నాడు రవ్వలకొండ.