విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ''గీతాంజలి'' కి తెలుగులో వచ్చిన సరికొత్త అనువాదమిది. మాతృభాషలో విద్యాబోధన జరగాలని, ప్రశాంతమైన ప్రకృతి మధ్యే విద్యకు సృజన అందుతుందని భావించి శాంతినికేతన్‌ ప్రాంగణంలో విశ్వభారతిని స్థాపించిన దార్శనికుడు ఠాగూర్‌. కళలకు, తాత్వికతకు, విద్యకు, సంస్కరణకు అంకితమైన కుటుంబంలో జన్మించిన ఠాగూర్‌ విశ్వకవిగా గుర్తింపు పొందారు. ఎనిమిదో ఏటనే ఒక ఫ్రెంచ్‌ కవితానువాదంతో సాహితీరంగంలోకి అడుగుపెట్టిన ఠాగూర్‌ తన నిరంతర కృషితో భారతీయ సాహిత్యానికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చారు. భారతీయ సాహిత్యానికి ఇప్పటి వరకూ నోబెల్‌ బహుమతి ఒక్కసారే వచ్చింది. అది కూడా ఠాగూర్‌ గీతాంజలికి మాత్రమే. 103 కవితావచనాలు గల గీతాంజలి (ఇంగ్లీషు)కి ఈ గౌరవం దక్కింది. బెంగాలీ భాషలో మొదటిసారి 51 కవితావచనాలతో గీతాంజలిని ఠాగూర్‌ రాశారు. ఆ తర్వాత దీనిని ఇంగ్లీషులోకి ఆయనే అనువాదం చేశారు. తన జీవితంలో ముప్పయి సంవత్సరాల నుంచి యాభైరెండో సంవత్సరం వరకూ ప్రకటించిన పది కావ్యసంపుటాల నుంచి మొత్తం 103 కవితావచనాలను ఎంపిక చేసి ఆంగ్ల గీతాంజలిని 1913 మార్చి నెలలో ముద్రించారు. ఆ ఏడాది డిసెంబర్‌ నాటికి ఇది 13 ముద్రణలు పొందిందంటే దీని ఘనత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకమే ఆసియా ఖండానికి సాహిత్యంలో తొలి నోబెల్‌ బహుమతిని 1913 నవంబర్‌ 13న అందించింది. విశేషమేమిటంటే ఈ బహుమతి గీతాంజలికి రాకముందే తెలుగులో దీనికి అదే ఏడాది తొలి అనువాదం వచ్చింది. ఇప్పటికి వందవరకూ తెలుగు అనువాదాలు వచ్చాయి. కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా విశ్వమానవతని కోరుకునేవారందరినీ గత శతాబ్ద కాలానికి పైగా ఆకర్షిస్తున్న గీతాంజలికి సాటిరాగలది ప్రపంచ సాహిత్యంలోనే ఇంకొకటి రాలేదు.

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good