గోరా రవీంద్రుని గొప్ప నవలే కాక, భారత దేశంలో రచించిన నవలలు అన్నిటికంటే బహుశా గొప్పది. దేశీయ సంప్రదాయాన్ని పున: కనుక్కోవడం, జాతీయ భావమును వివరించడం, సంస్కృతి సముద్ధరణ - వీటిని గురించి రచించిన మహాగ్రంథము గోరా. చివర దాకా ముచ్చట తరగని, ముగ్ధప్రణయగాథను ఆధారము చేసుకొని, పునరుద్దీప్తమైన భారత దేశ రూపము చిత్రించబడ్డది. పాత కొత్తల ఘర్షణమీద, నాటకీయ చమత్కారము, సంభావ్యశ్రేణిలో స్పష్టంగా తీర్చి దిద్దిన పాత్ర పరంపరద్వారా  నిలబడ్డది. ముచ్చట కొలుపుతూ, ఉత్సాహ మిస్తూ, ఆవేశము కలిగిస్తూ ఉన్న ఈ గోరా నవలకు విమర్శకులు ఆధునిక భారతీయ సాహిత్యములో అత్యుత్తమ రచనగా స్వాగతం చెప్పి సమాదరించడము సముచితమే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good